యాదాద్రి దర్శణానికి 4గంటలు

ఇన్నాళ్లు తిరుమల శ్రీవారి దర్శణానికి 12గంటల సమయం, భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది అని చెప్పుకొనేవాళ్లు. ఇప్పుడు తెలంగాణ తిరుపతి యాదాద్రి లక్ష్మీనరసింహుని దర్శణానికి చాలా సమయం పడుతోంది. యాదాద్రి పునర్మిణాం నేపథ్యంలో యాదాద్రికి వెళ్లే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నారు. శని, ఆదివారాలతే ఇంకా ఎక్కువ. కార్తీక మాసానికి తోడు అదివారం సెలవురోజు కావడంతో నేడు యాదాద్రికి భక్తులు భారీగా తరలివచ్చారు. 

కార్తీక దీపారాధనలో,సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. దీంతో స్వామివారి ధర్మదర్శనానికి 4 గంటలు, స్పెషల్ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. మరోవైపు ఆలయ భద్రత, ఆలయ అభివృద్ధి పనుల కారణంగా ఆలయ అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు. ప్రస్తుతం యాదాద్రి ఆలయ నిర్మాణాలు తుది దశకు చేరుకొన్నాయి.