విజయ్ ఓ ‘ఇంటి’వాడు అయ్యాడు !

గుడ్ న్యూస్.. ! టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ సలైంట్ గా ఓ ఇంటివాడు అయ్యాడు. అలాగని చెప్పి పెట్టకుండా విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకున్నాడని అనుకోకండీ.. ! విజయ్ సొంతిళ్లు కొనుకొన్నాడు. అవునూ.. ఫిల్మ్ నగర్ లో హీరో శ్రీకాంత్ ఇంటికి సమీపంలో అహ్లాదకరమైన వాతావరణంలో విజయ్ ఓ ఇల్లుని కొనుగోలు చేసినట్టు సమాచారమ్. ఆ కొత్తింట్లోకి విజయ్ తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఆదివారం గృహప్రవేశం చేసినట్లు తెలిసింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యామిలీ హాజరైనట్టు తెలుస్తోంది. నాగ్ అశ్విన్ తనయుడు రిషితో విజయ్ ఆడుకుంటున్న ఫోటో ఒకటి బయటికొచ్చింది.

విజయ్ నిర్మాతగా వ్యవహరించిన ‘మీకు మాత్రమే చెప్తా’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిట్ కాలేదు. కానీ మంచి లాభాలనే తీసుకొచ్చింది. ప్రస్తుతం విజయ్ ‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి క్రాంతి మాధవ్ దర్శకుడు. రాశీఖన్నా హీరోయిన్. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సినిమా ఉండనుంది. ఈ సినిమా కోసం ఫైటర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుంది.