మహా బలపరీక్షకు 24గంటలు మాత్రమే.. !
మహారాష్ట్ర రాజకీయాలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ 24 గంటలలోగా తన బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజ్ భవన్ మెజార్టీని నిర్ణయించలేదని.. కేవలం అసెంబ్లీ మాత్రమే మెజార్టీని నిరూపిస్తుందని… శాసనసభలోనే బలపరీక్ష జరగాలని ఆదేశించింది. ఫిరాయింపులను అడ్డుకోవాలంటే తక్షణమే బలపరీక్షను నిర్వహించాల్సిన అవసరం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.
ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఫడ్నవీస్‌కు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, 54మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు శరద్ పవార్ దగ్గరే ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వీరందరిని ముంబైలోని మూడు స్టార్ హోటల్స్ లో ఉంచినట్టు తెలుస్తోంది. మరీ.. 24గంటల్లో ఫడ్నవీస్ ప్రభుత్వం బలం నిరూపించుకుంటుందా ? అన్నది ఆసక్తిగా మారింది. లేని యెడల ఎన్సిపీ, కాంగ్రెస్ ల మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.