అయోధ్యపై కంగనా సినిమా

దశాబ్ధాలుగా కొనసాగుతున్న అయోధ్య వివాదంపై ఇటీవలే సుప్రీం కోర్టు తుది తీర్పుని వెల్లడించిన సంగతి తెలిసిందే. అది ఇరువర్గాలని సంతృప్తిని కలిగించింది. ఈ నేపథ్యంలో ఆయోధ్యలో రామమందిర నిర్మాణం దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పుడు ఈ రామమందిరంపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఓ సినిమా చేయనుంది. ఇటీవల కంగనా ‘రాణీ ఆఫ్ ఝాన్సీ’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ నిర్మాణ సంస్థలో వచ్చే తొలి సినిమాగా ‘రామమందిరం’ కథని ఎంచుకొన్నారు. 

ఇప్పటికే దీనికి సంబంధించిన కథను బాహుబలి సృష్టికర్త విజయేంద్రప్రసాద్ రాస్తున్నారు. ఎంతో కీలకమైన అయోధ్య మీదనే ఎందుకు సినిమా తీయాలనుకుంటున్నారు అంటే.. ? కొన్ని వందల సంవత్సరాల నుంచి రామమందిరం అనేది ఓ అంశంగా ఉంది. అయోధ్య కేసు దేశ రాజకీయాలను ఎంతగానో మార్చింది. అలాగే శతాబ్దాల నాటి ఈవివాదం భారతదేశంలోని లౌకిక స్ఫూర్తిని ప్రతిబింబించే తీర్పుతో ముగిసిపోయింది. ఓ నాస్తికుడు భక్తుడిగా ఎలా మారాడో చూపించేదే మా తపన అని కంగనా తెలిపింది.