‘ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేన’ల బలం 162
మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటి వరకు తెర వెనక ట్విస్టులని మాత్రమే చూశాం. ఇప్పుడు తెరముందు షో చేశాయి ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేన. తమ ఎమ్మెల్యేలతో కలిసి ప్రజా క్షేత్రంలో బల ప్రదర్శన చేశాయి. ఈ మూడు పార్టీలకు చెందిన 162 ఎమ్మెల్యేలు ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ ఆవరణలో పెరేడ్ చేశారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో పాటు, శరద్ పవార్ పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అశోక్ చవాన్, మల్లిఖార్జున్ ఖార్గేలు కూడా ఈ ప్రదర్వనలో పాల్గొన్నారు. మా బలం 162 మంది ఎమ్మెల్యేలు అంటూ చాటి చెప్పారు. ఈ సందర్భంగా గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీకి సవాలు విసిరారు.
ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ వద్ద 162 మంది శాసనసభ్యులు ఉన్నారు. అవసరమైతే స్వయంగా వచ్చి చూసుకోవాలని గవర్నర్ ని కోరారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు పూర్తి మెజార్టీ ఉంది. కానీ తమకు బల నిరూపణకు గవర్నర్ అవకాశం ఇవ్వట్లేదని రౌత్ పేర్కొన్నారు. మరోవైపు, 24గంటల్లో బల నిరూపణ చేసుకోవాలని సుప్రీం కోర్టు సూచించిన నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఆ పనుల్లో బిజీగా ఉంది. మరీ.. 162మంది కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన శిబిరం నుంచి ఎంతమందిని ఎలా లాగుతారు ? అన్నది అర్థం కానీ ప్రశ్నగా మారింది.
#WATCH Mumbai: Shiv Sena-NCP-Congress MLAs assemble at Hotel Grand Hyatt. #Maharashtra pic.twitter.com/7dmViA6uXF
— ANI (@ANI) November 25, 2019