ఈ వారంలోనే ఆర్టీసీ మూసివేత ?

కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకోబుతున్నట్టు సమాచారమ్. అందుకోసమే ఈ నెల 28న కేబినేట్ భేటీ జరనుందని చెబుతున్నారు. ఆర్టీసీని పూర్తిగా మూసివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని సమాచారమ్. గురువారం జరగబోయే రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. 

ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటుచేసే యోచనలో ఉందని తెలుస్తోంది. ఇప్పటికే రూట్ పర్మిట్లకి లైన్ క్లియర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో 5,100 ప్రయివేటు బస్సులని తీసుకొనే ప్రక్రియ జరుగుతోంది. ఆర్టీసీ పూర్తిగా మూసివేసే విషయంపై గురువారం జరగనున్న కేభినేట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఐతే సమ్మెపై లేబర్ కోర్టు ఇచ్చే తీర్పుపైనే ప్రభుత్వం నిర్ణయం ఆధారపడి ఉంది. లేబర్ కోర్టు ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని తేలిస్తే.. ఇక అంతే సంగతులు.

మరోవైపు, సోమవారం సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన ఆర్టీసీ కార్మికులు ఈరోజు విధుల్లోకి చేరేందుకు బస్ డిపోలకి చేరుకొన్నారు. ఐతే, వారిని తిరిగి విధుల్లోకి చేర్చుకొనేందుకు ఆర్టీసీ యాజమాన్యం నిరాకరించింది. లేబర్ కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగాలని సూచించింది. డిపోల వద్ద ఆందోళనలు చేస్తున్న కార్మికులని పోలీసులు అరెస్ట్ చేశారు.