ఆర్టీసీ కార్మికులపై జానారెడ్డి ఆవేదన

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చాలారోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఆర్టీసీ కార్మికులకి అన్యాయం జరుగుతుందంటూ.. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా పోయింది. కార్మికులు తిరిగి విధుల్లో చేరుతామంటే.. వారిని తిరిగి విధుల్లోకి తీసుకోమని ఆర్టీసీ ఎండీ ప్రకటన చేశారు. ఇంతకీ ఆయన ఎవరు ? రాష్ట్రంలో మంత్రులు లేరా ? ఆ ప్రకటన చేయడానికి రవాణా శాఖ మంత్రి లేరా ?? అంటూ జానారెడ్డి ప్రశ్నించారు.

తెరాస ప్రభుత్వంలో నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా పోయిందన్నారు. ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా చేస్తున్నారని జానా విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన మేధావులంతా ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నానని జానారెడ్డి పేర్కొన్నారు. అసలు ఇన్నాళ్లు జానారెడ్డి ఎక్కడిపోయారు. ఇన్నాళ్లు ఆర్టీసీ సమ్మెపై నోరు మెదపని జానా.. ఈరోజు గట్టిగానే మాట్లాడారు. మరీ..ఆయన మాటలకి సీఎం కేసీఆర్ విలువ ఇస్తారేమో చూడాలి.