‘అర్జున్ సురవరం’ మెగా సపోర్ట్ అదిరింది !


ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలకి మెగా సపోర్టు బాగా లభిస్తోంది. చిన్ని సినిమాగా తెరకెక్కిన ‘జార్జ్ రెడ్డి’ మెగా సపోర్టుతో పెద్ద సినిమాగా మారింది. పవన్ కల్యాణ్, చిరంజీవి, నాగబాబు.. జార్జ్ రెడ్డికి సపోర్ట్ చేశారు. దాని ఫలితంగా భారీ అంచనాల మధ్య విడుదలైన జార్జ్ రెడ్డి మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ ని రాబట్టింది. సినిమా కూడా మంచి టాక్ ని తెచ్చుకొంది. కాకపోతే.. జార్జ్ రెడ్డి జీవితకథని ఇంకా బాగా తీయొచ్చనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు వాయిదాల మీద వాయిదాలు పడుతున్న ఈ వారం ప్రేక్షకుల ముందుకు ముందుకు రాబోతున్న నిఖిల్ ‘అర్జున్ సురవరం’ చిత్రానికి మెగా సపోర్ట్ లభిచింది.

మంగళవారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎప్పుడూ లేని విధంగా చాలా సరదాగా కనిపించారు. హీరో నిఖిల్ పై పంచులేశాడు. చిరు మాట్లాడుతుండ నిఖిల్ చెవిలో ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు.  నాకు వయసు మీద పడుతుందిగా మతిమరుపు వచ్చిందనుకున్నాడు నిఖిల్. తన పేరు చెవిలో చెపుతున్నాడు అంటూ నవ్వులు పూయించాడు. అంతేకాదు.. అర్జున్ సురవంలో ‘చేగువేరా’ సంబంధించిన ఓ పాట ఉంది. చాలా అద్భుతంగా ఉంది.

 ఆ పాటను నా ఫేవరెట్‌ సింగర్‌ శంకర్‌ మహదేవన్‌ పాడారు. ఆ సాంగ్ చూస్తున్నంత సేపు.. ఆ ఇమేజ్‌ చూస్తున్నంత సేపు నాకు గుర్తొచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా..?` అంటూ పవన్‌ మేనరిజంను ఇమిటేట్‌ చేస్తూ మెడ మీద తన చేతితో రుద్దుతూ అభిమానుల్లో జోష్‌ నింపారు. నిఖిల్ రూపంలో నాకు తమ్ముడు దొరికాడని మెగాస్టార్ అన్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి పై చిరు పంచులేశాడు. ఆమె సొట్టబుగ్గలు భలే ఉంటాయని కామెంట్ చేశాడు. మొత్తానికి.. అర్జున్ సురవరంకి మెగాసపోర్ట్ అదిరింది.