అల.. టీజర్ ప్లాన్ చేశారట !

సంక్రాంతి సినిమాలు ప్రమోషన్స్ లో ఊపేస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ నాలుగురోజులుగా ట్రెండింగ్ టాప్ లోనే కొనసాగుతుండటం విశేషం. అంతకుముందు మరో సంక్రాంతి సినిమా అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురంలో’ పాటలు వచ్చి.. సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఇక ఇప్పుడు అల.. నుంచి టీజర్ రాబోతుంది. అతి త్వరలోనే ఒక నిమిషం నివిడిగల టీజర్ ని వదలేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. టీజర్ లో అసలు సిసలు త్రివిక్రమ్ మార్క్ ని చూపించబోతున్నారని సమాచారమ్.

టీజర్ లో మంచి ఎమోషన్స్ తో పాటు హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్స్, పంచ్ డైలాగ్స్ తో పాటు ఒక యాక్షన్ సీన్ కూడా ఉండనుందట. ఇక టీజర్ మొత్తం మంచి పవర్ ప్యాక్డ్ గా ఉండేలా సినిమా యూనిట్ దీనిని రూపొందించిందట. సరిలేరు టీజర్ లో ‘భయపడేవారే బేరాలకొస్తారు’ అనే డైలాగ్ ఉంది. అది అల.. ని ఉద్దేశించే అన్నారనే బన్నీ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. మరీ.. అల..లోని సరిలేరుపై పంచులేస్తారా ? అనేది చూడాలి. సాధారణంగా త్రివిక్రమ్ కి కయ్యానికి కాలుదువ్వే స్వభావం కాదు. 

ఈ చిత్రంలో బన్నీకి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. బాలీవుడ్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. యంగ్ హీరోలు సుశాంత్, నవదీప్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా అల.. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.