కేసీఆర్’ని కేంద్రం డైరెక్ట్ చేస్తుందా ?

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల బతుకులు ఆగమయ్యే పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం ఆర్టీసీ జేఏసీ నేతలు, వాళ్లకి ప్రధాన బలంగా నిలిచిన తెలంగాణ భాజాపానే అని చెప్పాలి. ఆర్టీసీ విషయంలో నిర్ణయం తీసుకోవడం సీఎం కేసీఆర్ చేతుల్లో లేదు. దానికి కేంద్రం అనుమతి కావాలి. కేంద్రం కార్మికులకి అన్యాయం చేయదు. కేంద్రం కార్మికులకి మద్దతు ఇచ్చేలా చేసే మాది అన్నట్టు మాట్లాడారు తెలంగాణ భాజాపా అధ్యక్షుడు లక్ష్మణ్. కానీ, ఏమీ చేయలేకపోయాడు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు పోయాలా ఉన్నాయి. ఈ సమయంలో లక్ష్మణ్ ఢిల్లీలో ఉన్నారు. అక్కడి నుంచి తాజాగా ఓ వార్త కూడా వినిపించాడు.

ఇంతకీ లక్ష్మణ్ ఏమన్నారంటే.. ? ఆర్టీసీని మూసివేసేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్టీసీ సమస్యను కేంద్రం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.రెండ్రోజులుగా జాతీయ నాయకులు జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్‌ను కలిసి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను వివరించాం. ఇప్పటికే కేంద్రం నుంచి సీఎం కేసీఆర్‌కు సూచనలు వెళ్లాయి. రేపు జరిగే మంత్రివర్గ భేటీలో ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే నిర్ణయం తీసుకుంటే భాజపా చూస్తూ ఊరుకోదని లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రవాణా చట్టం ఆధారంగానే సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ విషయంలో కీలక నిర్ణయం తీసుకొంటుంది. దాన్ని కేంద్రం ఎలా ఆపుతుంది ? ఎలా కార్మికులకి న్యాయం చేస్తుంది ??అనేది లక్ష్మణుడికే తెలియాలి.