గ్రేట్ : ఒకేసారి 12 సినిమాలు

యేడాది ఒక్క సినిమా చేయడానికే క్రిందా మీదా పడుతున్నారు టాలీవుడ్ హీరోలు. అలాంటిది ఏకకాలంలో 12 సినిమాల్లో నటిస్తూ హవా చూపిస్తున్నాడు కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి. ‘నాకు ఎవరికిపోటీ కాదు. నేనెవ్వరికీ పోటీ కాదు. నాకు నేనే పోటీ’ అని చెప్పుకొనే విజయ్ సేతుపతి వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని ఆకట్టుకొంటున్నారు. హీరోగా నటిస్తూనే, విలన్  పాత్రలు చేస్తున్నారు. కోలీవుడ్ లో ఎక్కువగా హీరో పాత్రలు చేస్తే.. పర భాషల్లో ఎక్కువగా విలన్ పాత్రల్లో నటిస్తున్నారు. 

 తెలుగులో సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ చేయబోయే చిత్రంలో కూడా విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. వైష్ణవ్‌తేజ్‌ చిత్రంలోనూ ప్రతినాయక పాత్ర చేయనున్నారు.  ప్రస్తుతం కడైసి వివసాయి, లాభం, క/పె రణసింగం, ఓ మై కడవులే, యాదుం ఊరే, యావరుం కేలీర్‌ తదితర చిత్రాల్లో విజయ్ నటిస్తున్నారు. అన్ని రకాల పాత్రలు చేస్తూ సంపూర్ణ నటుడు అనిపించుకొంటున్నాడు.