శ్రీకృష్ణుడుగా అల్లు అర్జున్ !

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ శ్రీకృష్ణుడుగా కనిపించబోతున్నట్టు సమాచారమ్. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబో హ్యాట్రిక్ చిత్రంగా ‘అల.. వైకుంఠపురంలో’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులోనే బన్నీ శ్రీకృష్ణుడిగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది.పోతన భాగవతంలోని గజేంద్ర మోక్షంలోని ఒక పద్యాన్ని ప్రేరణగా తీసుకుని త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ అన్న టైటిల్ ఫిక్స్ చేశాడు. ఈ సినిమా కథ కూడా శ్రీకృష్ణుడి యాంగిల్ లో సాగుతుందట. కృష్ణుడు దేవకి కి పుట్టినా యశోద దగ్గర పెరిగినట్లుగా ఆ పాయింట్ ను ఇప్పటి పరిస్థితులకు అన్వయించి అల.. తెరకెక్కిస్తున్నారని చెప్పుకొంటున్నారు.

బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టిన అల్లు అర్జున్ ను అతడి తల్లితండ్రులు ఒక పేద కుటుంబానికి అప్పచేప్పడంతో అక్కడ పెరుగుతాడు. ఐతే, ఆతరువాత అతడు తన కుటుంబ నేపధ్యం గురించి వాస్తవాలు తెలుసుకుని శ్రీకృష్ణుడు గోకులం నుండి ద్వారకకు వెళ్ళినట్లుగా బన్నీ తన పేద ఇంటి నుండి విలాసవంతమైన మహల్ లోకి వెళ్ళడానికి చేసే ప్రయత్నమే అల.. కథని చెబుతున్నారు. ఈ క్రమంలో బన్నీకి అనేకమంది విలన్స్ ఎదురైన విధానాన్ని తెరపై చూపించబోతున్నాడు త్రివిక్రమ్. ఈ నేపథ్యంలోనే బన్నీ మాడ్రన్ శ్రీకృష్ణుడిగా కనిపించబోతున్నట్టు చెప్పుకొంటున్నారు. అలాగని.. శ్రీకృష్ణుడి రొమాంటిక్ యాంగిల్ ని ఇందులో త్రివిక్రమ్ పూర్తిస్థాయిలో చూపించలేదని కూడా చెబుతున్నారు.