ప్రేమకు కృతజ్ఝతలు చెప్పిన బన్నీ
స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రేమకి ప్రేమగా కృతజ్ఝతలు తెలిపారు. సుకుమార్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘ఆర్య2’. 2004లో విడుదలైన ‘ఆర్య’ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఆర్య2’ని తీసుకొచ్చారు. నవంబర్ 27, 2009లో ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నేటితో ఈ సినిమా పదేళ్లు పూర్తి చేసుకొంది. దీంతో ట్విట్టర్ వేదిక బన్నీ స్పెషల్ పోస్ట్ పెట్టారు.
“ఉప్పెనంత ఈ ప్రేమకు.. గుప్పెడంత గుండె ఏమిటో..’ ఇది చాలా నిజం. నా హృదయం ఎప్పటికీ సరిపోదు. ఆ ప్రేమకు ధన్యవాదాలు. ‘ఆర్య-2’ ప్రయాణంలో దేవిశ్రీ ప్రసాద్, కాజల్ అగర్వాల్, శ్రద్ధాదాస్, నవదీప్‌తోపాటు ఇంకా చాలామందికి ధన్యవాదాలు. ‘ఆర్య’, ‘ఆర్య-2’ చిత్రాలతో నాకు మంచి విజయాన్ని అందించిన సుకుమార్‌కు ఎన్ని విధాలుగా కృతజ్ఞతలు చెప్పిన సరిపోదు. మీ ప్రేమకు ధన్యవాదాలు. ‘ఐ లవ్ యూ నా ఊపిరి ఆగిపోయినా.. ఐ లవ్ యూ నా ప్రాణం పోయినా” అని బన్నీ రాసుకొచ్చారు. బన్నీ ట్విట్ కి దేవిశ్రీ ప్రసాద్, రానా రిప్లై ఇచ్చారు. మాకు మధురజ్ఝాపకాలు మిగిల్చిన సినిమా అని కామెంట్స్ పెట్టారు.