బాలీవుడ్ హీరోయిన్స్ నిక్ నేమ్స్ ఏంటో తెలుసా ?


హీరోయిన్స్ గురించి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి వాళ్ల అభిమానులకి ఉండటం సాధారణం. హీరోయిన్స్ ఇంటర్వ్యూలు ఫాలో అయ్యేవాళ్లకి వారి అలవాట్లు, అభిరుచుల గురించి తెలిసిపోతుంది. కానీ, వారి నిక్ నేమ్స్ ఏంటన్నది చాలా వరకు బయటికి తెలియదు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్స్ నిక్ నేమ్స్ ఏంటన్నది బయటికి తెలిసిందే.

బాలీవుడ్ నటి ప్రియాకా చోప్రా జోనస్ నిక్ నేమ్ – మిమి. దానికి అర్థం ఏంటన్నది మాత్రం తెలియదు. ఇక ఆమె భర్త నిక్ జోనస్‌ నిక్ నేమ్ నిక్ నేమ్  ‘బాబు’. ఇండియాలో బాబులకి ప్రాధాన్యత ఉంటుంది. బహుశా.. అందుకే ప్రియాంక తన భర్తని ‘బాబు’ అని పిలిచుకుంటుందేమో. అలియా భట్‌ను ‘ఆలూ’, పరిణీతి చోప్రాను ‘టిషా’, కరీనా కపూర్‌ను ‘బెబో’, కరిష్మాను ‘లోలో’, శ్రద్ధాకపూర్‌ను ‘చిర్కుట్’, సోనమ్‌కపూర్ ‘జిరాఫ్’ అని పిలుస్తుంటారు. చాలా గమ్మత్తుగా ఉన్నాయి కదూ.. !