‘నరసింహనాయుడు’ మళ్లీ రాబోతున్నాడు !

నందమూరి అభిమానులకి గుడ్ న్యూస్. ‘నరసింహనాయుడు’ మళ్లీ రాబోతున్నాడు. బాలకృష్ణ కెరీర్’లో బ్లాక్ బస్టర్ హిట్స్ లో ‘నరసింహనాయుడు’ ఒకటి. 2001 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘నరసింహనాయుడు’ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌’గా నిలిచాడు. బి. గోపాల్‌ దర్శకత్వంలో ఫ్యాక్షన్‌ నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. దాదాపు పదహారేళ్ల తర్వాత ‘నరసింహనాయుడు’ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది.

ప్రస్తుతం ఈ సీక్వెల్ స్క్రిప్ట్ పనుల్లో రచయిత చిన్నికృష్ణ బిజీగా ఉన్నాడు. స్క్రిప్టు పనులు దాదాపు పూర్తికావొస్తున్నాయి. ‘నరసింహనాయుడు – 2 ‘ వర్కింగ్ టైటిల్’తో త్వరలోనే ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఈ సీక్వెల్ కి దర్శకుడు, నిర్మాత ఎవరు ? హీరోయిన్ గా ఎవరు కనిపించబోతున్నారు ? అన్నది త్వరలోనే తెలియనుంది. ఇదే నిజమైతే… ‘జై సింహా’ తర్వాత బాలకృష్ణ చేయబోయే సినిమా ఇదే కానుంది.