ఆర్టీసీలో బలవంతపు రిటైర్మెంట్లు ?
తెలంగాణ ఆర్టీసీ భవితవ్యం ఏంటన్నది ఇవాళ లేక రేపటిలోగా తేలనుంది. ఇవాళ సమావేశం కానున్న తెలంగాణ కేబినేట్ ప్రధానంగా ఆర్టీసీపై చర్చించనుంది. అవసరమైతే రేపు కూడా కేబినేట్ భేటీ కొనసాగనుంది. ఆర్టీసీ ప్రైవేటీకరణకే మొగ్గుచూపుతోన్న ప్రభుత్వం కార్మికులకు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ అమలుచేసి ఇంటికి పంపించనుందనే ప్రచారం జరుగుతోంది.
15ఏళ్ల సర్వీస్… 50ఏళ్లు దాటిన కార్మికులందరినీ ఇంటికి పంపేందుకు రంగంసిద్ధమైంది సమాచారమ్. అదే జరిగితే.. 48వేల మంది కార్మికుల్లో మెజారిటీ సిబ్బంది ఉద్యోగాలను కోల్పోనున్నారు. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ అమలుచేస్తే, ఆర్టీసీ కార్మికులకు పెన్షన్, గ్రాడ్యుటీతోపాటు ఫైనల్ సెటిల్‌మెంట్ చేయాల్సి ఉంటుంది.
మరీ.. 50యేళ్లకి తక్కువ వయసు ఉన్నవారిని ఏం చేస్తారన్నది తెలియాల్సి ఉంది. కంపల్సరీ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అమలు చేస్తే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు అడ్డురాకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ముందస్తు ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారమ్. మొత్తానికి ఆర్టీసీ సమస్యపై శాశ్వత పరిష్కారం దిశగా సీఎం కేసీఆర్ సంచనల నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.