పవిత్రమైన మట్టి వద్ద మోకరిల్లిన బాబు ! 

ఏపీ రాజధాని అమరావతిలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఆయనకి కొన్ని నిరసనలు ఎదురైనా.. పర్యటనని కొనసాగిస్తున్నారు. ఉండవల్లి నివాసం నుంచి వెళ్లి ముందు ప్రజా వేదిక కూల్చిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం బస్సులో బయల్దేరి ఉద్దండరాయుని పాలెం చేరుకున్నారు. అక్కడ బొడ్రాయికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. 

అనంతరం బస్సులో బయల్దేరి అమరావతికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతానికి వెళ్లారు. శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో కలిసి పరిశీలించారు. అక్కడ చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పవిత్రమైన మట్టికి చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు. రాజధాని నిర్మాణం ఆపడమంటే…. 33వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులను అవమానించడమేనన్నారు.