హైదరాబాద్’కు మరో ప్రతిష్టాత్మక సంస్థ
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్ నగరానికి మరో ప్రతిష్టాత్మక సంస్థ రానుందని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘డిసెంబర్ 2న తెలంగాణ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక సంస్థ రానుంది. హైదరాబాద్ లో డిజైన్, ఇంజినీరింగ్ కేంద్రాన్ని ప్రఖ్యాత సంస్థ ఇంటెల్ ప్రారంభించనుంది. కీలక ఉత్పాదనల గమ్యస్థానంగా హైదరాబాద్ స్థానం మరింత పదిలం కానుంది’ అని కేటీఆర్ ట్విట్ చేశారు.