బ్రేకింగ్ : సీఎంగా ఉద్దవ్ ప్రమాణ స్వీకారాన్ని ఆపండి
మహా రాజకీయాలని మించిన థ్రిల్లర్ సినిమా ఇప్పటి వరకు రాలేదేమో.. ! మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్తులకి ఇంకా పులిస్టాప్ పడటం లేదు. ఫైనల్ గా శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు పార్టీల మధ్య మంత్రి పదవుల పంపకం కూడా అయిపోయింది. మరికొద్దిసేపట్లోనే మహా సీఎంగా ఉద్దమ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేయకుండా నిలువరించాలని కోరుతూ బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ఒకవేళ ఈ పిటిషన్ ని బొంబాయి హైకోర్టు విచారణకి స్వీకరించి ఉంటే.. మహా రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ పరిస్థితులు ఎదురయ్యేవే. అప్పుడు మహా కూటమిలో చీలకలు వచ్చే ప్రమాదం ఉండేది.