‘అజ్ఝాతవాసి’ హవా మొదలయ్యింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఆ సందడే వేరు. ఈ సంక్రాంతికి పవన్ ‘అజ్ఝాతవాసి’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, ఇప్పటికే ‘అజ్ఝాతవాసి’ హవా మొదలైపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యుఎస్’లోనూ ‘అజ్ఝాతవాసి’ హవా మొదలయ్యింది. అక్కడ అజ్ఝాతవాసి రికార్డు స్థాయిలో 209 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.

ఇప్పటి వరకు యుఎస్’లో మరో ఏ తెలుగు సినిమాకు ఇన్ని థియేటర్స్ దక్కలేదు. ప్రపంచ వ్యాప్తంగా సత్తాచాటిన ‘బాహుబలి 2’ యుఎస్’లో 126 ప్రాంతాల్లో రిలీజైంది. మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా 74 ప్రాంతాల్లో, సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కబాలి’ని 73 ప్రాంతాల్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు ‘అజ్ఝాతవాసి’ రికార్డు స్థాయిలో 209 ప్రాంతాల్లో రిలీజ్ కాబోతుంది. దీనిని పవన్ – త్రివిక్రమ్ సినిమాకు గల క్రేజ్’కు నిదర్శనంగా చెప్పవచ్చు.

ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూయేల్ లు జతకట్టనున్నారు. సంగీతం అనిరుధ్. రాథాకృష్ణ నిర్మాత. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.