సంతోషంగా డ్యూటీలో చేరుతున్న ఆర్టీసీ కార్మికులు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకి తీపి కబురు చెప్పిన సంగతి తెలిసిందే. ఎలాంటి కండీషన్స్ లేవ్. శుక్రవారం ఉదయమే ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరండి. హాయిగా ఉండండి. మీ సంస్థని ముందుకు నడిపించండని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం వారంతా ఉదయం నుంచే డిపోలకు చేరుకుంటున్నారు. షరతుల్లేకుండా విధుల్లోకి తీసుకోవడం సంతోషకరమని, సంస్థను అభివృద్ధి బాటలో నడిపించేందుకు కృషి చేస్తామని చెబుతున్నారు. దీంతో 52 రోజుల సమ్మె తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా డిపోల వద్ద పండగ వాతావరణం నెలకొం
వాస్తవానికి సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రయివేటు పరం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్టు ప్రచారం జరిగింది. ఐతే, అందుకు భిన్నంగా మానవ దృక్పథంలో ఆర్టీసీ కార్మికులని ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకొంది. అంతేకాదు.. ఆర్టీసీకి రూ.100 కోట్ల తక్షణ ఆర్థిక సాయం అందిస్తామని సీఎం తెలిపారు. సంస్థ మనుగడ కోసం కిలోమీటరుకు 20 పైసల చొప్పున ఛార్జీలను పెంచుతున్నామన్నారు. సోమవారం నుంచి ఇవి అమల్లోకి వస్తాయన్నారు. ఛార్జీల పెంపుదల ద్వారా రూ.760 కోట్ల అదనపు ఆదాయాన్ని అంచనా వేస్తున్నామన్నారు.సమ్మెకాలంలో చనిపోయిన కార్మికులకు సంబంధించి వారి కుటుంబాల్లో ఒకరికి ఆర్టీసీలో గానీ, ప్రభుత్వంలో గానీ ఉద్యోగం ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు.