మహేష్ సినిమా కోసం యంగ్ హీరో కసరత్తులు చూశారా ?

సూపర్ స్టార్ మహేష్ సినిమా కోసం యంగ్ హీరో కండల పెంచుతుండటం హాట్ టాపిక్ గా మారింది. ఆ యంగ్ హీరో అడవిశేష్. విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులని ఆకట్టుకొన్నాడు శేష్. క్షణం, గూఢాచారి, ఎవరు సినిమాలతో విజయాలు అందుకొన్నాడు. ఈ సినిమా కోసం రచనా సహాకారం కూడా చేశారు. ఇటు హీరోగా, అటు రచయితగా విజయాలు అందుకొంటున్నాడు.

శేష్ తాజా చిత్రం ‘మేజర్’. ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. 2008లో ముంబైలో జరిగిన టెర్రర్ అటాక్ లో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ కమాండర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ మేజర్ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చేసింది. మేజర్ లుక్ లో అడవిశేష్ విడుదల చేశారు. ఈ సినిమా కోసం భారీ కండ‌లు పెంచే ప‌నిలో ఉన్నారు అడ‌వి శేషు. జిమ్‌లో భారీ క‌స‌ర‌త్తులు చేస్తూ, బాడీని పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. దానికి సంబంధించిన జిమ్ వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

View this post on Instagram

On the way. #MajorTheFilm #fitmap @i_sureshnanda

A post shared by Sesh Adivi (@adivisesh) on