హైదరాబాద్ లో భద్రతని ప్రశ్నించిన కీర్తి సురేష్ 

హైదరాబాద్ నగర పరిధిలోని షాద్ నగర్ లో ప్రియాంకరెడ్డి (22) అనే వెటర్నరి దారుణ హత్యకి గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య యావత్ దేశాన్ని కలచివేస్తోంది. ఇన్నాళ్లు దేశంలో హైదరాబాద్ సేఫ్ ప్లేస్ అనుకొనేవాళ్లు.. ఈ ఘటనతో నోరెళ్లబెడుతున్నారు. హీరోయిన్ కీర్తి సురేష్ ఓ అడుగు ముందుకేసి.. హైదరాబాద్ లో భద్రతపై ప్రశ్నించింది. హైదరాబాద్‌ నగరం అంటే సురక్షిత ప్రాంతమని నేను నమ్మేదాన్ని .. ఇప్పుడు అక్కడే దారుణం జరగడం జీర్ణించుకోలేకపోతున్నానని ట్విట్టర్ వేదిక కీర్తి సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

“ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటన తనని తీవ్రంగా కలిచివేసింది. రోజు రోజు పరిస్థితులు మరింత భయానకంగా అవుతున్నాయి. హైదరాబాద్‌ నగరం అంటే సురక్షిత ప్రాంతమని నేను నమ్మేదాన్ని. కానీ అలాంటి చోట కూడా ఇలాంటి దారుణ సంఘటన జరగడంతో.. నాకు ఏ మాట్లాడాలో కూడా తెలీడం లేదు. ఈ ఘటనలో ఎవరిని నిందించాలో కూడా అర్థం కావడం లేదు. ఈ దేశంలో మహిళలు స్వేచ్ఛగా సంచరించే సమయం ఎప్పుడొస్తుందో..? అమ్మాయిలపై అఘాయిత్యాలు చేసే ప్రతి కర్కశుడిని వీలైనంత త్వరగా శిక్షించాలి. ప్రియాంక కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నా. దోషులు త్వరగా దొరకాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. నేను కర్మను కచ్చితంగా నమ్ముతా” అని ట్విట్టర్ లో పేర్కొంది.

కీర్తి సురేష్ ఆవేదనలో న్యాయం ఉంది. దేశంలో హైదరాబాద్ అన్ని రకాల సేఫ్ ప్లేస్ అనే గుర్తింపు ఉంది. ఇక ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఉగ్రదాడులు, గొడవలు లేవనే చెప్పాలి. ఇక్కడ అంత పక్డ్భంధీగా భద్రతని కలిపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం షీ టీమ్స్ ఏర్పాటు చేసి.. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టిని సారించింది. అయినా.. మొన్న తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్య, నేడు ప్రియాంకరెడ్డి హత్య హైదరాబాద్ లో భద్రతని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.