జగన్ పై లోకేష్ ట్విట్టర్ దాడి

తెదేపా యువ నేత నారా లోకేష్ కు ట్విట్టర్ బాబు అనే బిరుదు ఉంది. ఆ బిరుదుని సార్థకం చేస్తూ తాజాగా ఆయన సీఎం జగన్ పై ట్విట్టర్ దాడికి దిగాడు. ఓ కోయిల ముందే కూసింది అన్నట్టు.. సీఎం జగన్ ఆర్నెళ్ల పాలనపై వరుస ట్విట్లతో విమర్శించే ప్రయత్నం చేశారు. ఈ విమర్శల్లోనూ సీఎం జగన్ చేసిన గొప్ప పనులు కనిపించడం విశేషం. ఇంతకీ లోకేష్ ఏమన్నారంటే.. ?

“ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అన్న@ysjagan  గారు రాష్ట్రాన్ని ముంచేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. విధ్వంసంతో ప్రారంభం అయిన వైకాపా ఆరు నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ప్రదేశ్ గా మార్చారు. ఎన్నికలకు ముందు నవరత్నాలు ఇస్తా అన్న జగన్ గారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మాట మార్చి ప్రజల నెత్తిన నవరత్న తైలం రాసారు” అని ట్విట్ చేశారు. 

“ఆరు నెలల్లో అభివృద్ధి శూన్యం. సంక్షేమం సున్నా. పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఒక మాయ. అధికారంలోకి వచ్చిన తరువాత @ysjagan గారు మహిళల్ని మోసం చెయ్యడం, రైతులను దగా చెయ్యడం, యువతని నిలువునా ముంచటం, పేదవాడి పొట్ట కొట్టటం మాత్రమే నిజం . వృద్దులకు నెలకు రూ.250, రైతులకు 625 రూపాయిలు ఇస్తున్న జగన్ గారు గ్రామ వాలంటీర్ల పేరుతో వైకాపా కార్యకర్తలకు నెలకు రూ.8 వేలు ఇస్తూ ఏడాదికి రూ.4 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచేస్తున్నారు” అంటూ వరుస ట్విట్లు చేశారు.