మంత్రి మంచి మాట చెప్పారు
తెలంగాణ మంత్రి ఇంద్రకరన్ రెడ్డి ఓ మంచి మాట చెప్పారు. రాష్ట్రంలో జూట్, పేపర్ బ్యాగ్ ల వినియోగాన్ని పెంచుతున్నట్టు తెలిపారు. ఢిల్లీలో అటవీశాఖ మంత్రుల సమావేశానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. “ప్లాస్టిక్ పూర్తి నిషేధం దిశగా అడుగులు వేస్తున్నాం. ఇప్పటికే షాపుల్లో ప్లాస్టిక్ కవర్స్ వాడకాన్ని నిషేధించాం. అదేసమయంలో జూన్, పేపర్ బ్యాగ్ ల వినియోగం పెంచుతున్నాం. తెలంగాణ ఏర్పడ్డాక 1.17కోట్ల మొక్కలు నాటామన్నారు. అడవులను 33శాతానికి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. రూ.3,110కోట్ల కంపా నిధులు తెలంగాణకు వచ్చాయి” అన్నారు.