రాశీఖన్నా బర్త్ డే స్పెషల్ చూశారా ?

అందం ఎరగా వేసి.. ఆ తర్వాత తనలోని అసలు సిసలు టాలెంట్ ని బయటపెట్టిన ముద్దుగుమ్మ రాశీఖన్నా. కెరీర్ స్టార్టింగ్ లో గ్లామర్ పాత్రలే ఎక్కువ చేసింది. గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొంది. ఐతే, ‘తొలిప్రేమతో’ రాశీ మంచి నటి అనిపించుకొంది. ఇప్పుడు అటు గ్లామర్, ఇటు నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనూ నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఈరోజు రాశీ బర్త్ డే. ఈ సందర్భంగా వెంఖీమామ నుంచి రాశీ బర్త్ డే స్పెషల్ ఒకటి విడుదల చేశారు.

“సందర్భానికి తగిన ఒక డైలాగ్. చైతూకి ఓ ముద్దు సీన్, వెంకీతో ఓ ఫన్నీ సీన్ తో’ వీడియోని కట్ చేశారు. బర్త్ డే రోజున వదిలిన వీడియోలో ఆనందం మొత్తం ఆమె మొహంలో కనిపిస్తోంది. ఇక వెంకీమాలో పాయల్ రాజ్ పుత్ మరో హీరోయిన్ గా కనిపించనుంది.బాబీ దర్శకత్వం వహించిన వెంకీమామ  ‘క్రిస్మస్’ కానుకగా డిసెంబర్ 25వ తేదీన విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.