అటు స్టెప్పులు.. ఇటు సెలబ్రేషన్స్ !


యంగ్ హీరోయిన్ రాశీఖన్నా పుట్టినరోజు నేడు. ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్ ‘ప్రతిరోజూ పండగే’ సెట్స్ లో ఘనంగా జరిగాయి. దానికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మారుతి దర్శకత్వంలో సాయితేజ్-రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. ఈరోజు ఈ సినిమా షూటింగ్ కి ఆఖరి రోజు. చివరిరోజు తేజు-రాశీలపై ఓ పాటని చిత్రీకరించారు. వీరిద్దరు కలిసి అదిరిపోయే స్టప్పులేశారు. ఆ ఫోటోలు కూడా కొన్ని బయటికొచ్చాయ్. దీంతో ఇటు స్టెప్పులు.. అటు సెలబ్రేషన్స్ జరిగాయని కామెంట్స్ చేస్తున్నారు. డిసెంబర్ 20న ‘ప్రతిరోజూ పండగే’ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇక రాశీఖన్నా నటిస్తున్న మరో చిత్రం ‘వెంకీమామ’. ఈ సినిమా నుంచి రాశీఖన్నా బర్త్ డే కానుకగా ఓ వీడియోని విడుదల చేశారు. “సందర్భానికి తగిన ఒక డైలాగ్. చైతూకి ఓ ముద్దు సీన్, వెంకీతో ఓ ఫన్నీ సీన్ తో’ వీడియోని కట్ చేశారు. మరోవైపు, బర్త్ డే సందర్భంగా రాశీఖన్నా సన్నిహితులు, స్నేహితులు, ప్రేక్షకుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తున్నాయ్.