తెలంగాణ: గీతన్నకు పరిహారం
తెలంగాణలో ప్రమాదవశాత్తు మరణించిన,గాయపడిన వారికోసం ప్రభుత్వం వారికి ఆర్థికంగా సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. వారికి ఆర్థికంగా ఆదుకోవడం కోసం కొంత బడ్జెట్ ను కూడా కేటాయించింది ప్రభుత్వం. తాజాగా గీత కార్మికుల పరిహారం కోసం పదికోట్ల 97లక్షల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. నిధుల విడుదలపై గీతన్నలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.