నాగ్ కి నో చెప్పేసింది
మన్మథుడు నాగార్జునకి లేడీ ఫాలోయింగ్ ఎక్కువే. మన్మథుడు అనగానే గుర్తొచ్చేది నాగార్జున. ఆరుపదుల్లోనూ అందంగా… అదే ఉత్సాహంతో కుర్రహీరోలకు సైతం గట్టి పోటీఇస్తున్న నాగ్ ని అప్పట్లో ఓ అమ్మాయి రిజెక్ట్ చేసిందట. కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే నాగ్ ఓ అమ్మాయితో రొమాన్స్ చేసే వాడట. ఆ అమ్మాయితోనే ఫస్ట్ కిస్ అన్నమాట. ఐతే, ఆ అమ్మాయి నాగ్ ప్రేమకి నో చెప్పిందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగ్ జీవితంలోని మధుర జ్ఝాపకాలని గుర్తు చేసుకొన్నారు.
చాలామంది ‘విక్రమ్’ తన తొలి సినిమా అనుకుంటారు. కానీ అంకకంటే ముందే.. 1967లో వచ్చిన నాన్నగారి సినిమా ‘సుడిగుండాలు’లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించా. అప్పుడు నాకు ఎనిమిదేళ్లు ఉంటాయని తెలిపారు నాగ్. గీతాంజలి… ఆ సినిమా చూశాక ఆయన ఆనందానికి అవధుల్లేవు. ఇక నాపై ఉన్న లవ్వర్ బోయ్ ఇమేజ్ ని దర్శకుడు రాఘవేంద్ర రావు మార్చేశారు. అన్నమయ్య సినిమా తనని ఫ్యామిలీ ప్రేక్షకులకి దగ్గర చేసిందని చెప్పుకొచ్చారు.
ఇక ఖాళీగా ఉంటే పుస్తకాలు చదువుతా. ట్విట్టర్ తాను ఫాలో అయ్యే ఏకైక వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని తెలిపారు నాగ్. మన్మథుడు 2 తర్వాత బంగార్రాజు సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు నాగ్. ఈ చిత్రానికి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నాగ చైతన్య ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.