‘వెంకీమామ’ రిలీజ్ డేటు

‘వెంకీమామ’ రిలీజ్ డేటుని మరికొద్దిసేపట్లో ప్రకటించబోతున్నారు. కె. ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, ఆయన మేనల్లుడు నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమా రిలీజ్ డేటు విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తూ వస్తోంది చిత్రబృందం. వాస్తవానికి ‘వెంకీమామ’ సినిమా సంక్రాంతి సీజన్ ని టార్గెట్ గా పెట్టుకొని తెరకెక్కింది. షూటింగ్ లో జాప్యం, సంక్రాంతికి రేసులో మహేష్, బన్నీ సినిమాలు ఉండటంతో సంక్రాంతికి రావాలన్న నిర్ణయాన్ని మార్చుకొన్నాడు వెంకీమామ.

ఆ తర్వాత వెంకీమామ డిసెంబర్ 20కి మించిన మంచి డేటు లేదని భావించారు. కానీ, ఆ డేటు దగ్గరపడుతున్నా.. అధికారికంగా ప్రకటించలేదు. డిసెంబర్ 20న బాలయ్య రూలర్, సాయితేజు ప్రతిరోజూ పండగ సినిమాలు రానున్న నేపథ్యంలో వెంకీమామ డిసెంబర్ 25న రాబడుతున్నాడు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన మరికొద్దిసేపట్లో రాబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, అనూహ్యంగా వెంకీమామ సంక్రాంతి రేసులోకి దూసుకురానున్నాడు. జనవరి 14న వెంకీమామ వచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మరికొద్దిసేపట్లో క్లారిటీ రానుంది. 

ఈ చిత్రంలో చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా నటిస్తుండగా, వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ మెరవనుంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.