‘దిశ’ కేసు : కానిస్టేబుల్ సప్సెన్స్
‘దిశ’ ఘటన యావత్ దేశాన్ని నివ్వెరపోయేలా చేసింది. దిశ నిందితులని తక్షణం ఉరితీయాలనే డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ లోనూ ఈరోజు ‘దిశ’ ఘటనపై వేడి వేడి చర్చ జరిగింది. దిశ నిందితులకి తక్షణమే ఉరిశిక్ష అమలు చేయాలని పలువురు ఎంపీలు డిమాండ్ చేశారు. దిశ లాంటి ఘటనలో నిందితులకి కఠిన శిక్షలు విధించేందుకు చట్టాలని మార్చాలనే సభ్యులు సూచించారు.
మరోవైపు, దిశ కేసులో ఓ కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. దిశ నిందితులని చర్లపల్లి జైలుకి తీసుకొచ్చిన సమయంలో నిందితులని వీడియా తీశాడు ఓ కానిస్టేబుల్. ఆ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై పోలీసు శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు కానిస్టేబుల్ ని వెంటనే విధుల నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు.