‘దిశ’ నిందితులకి ఇప్పట్లో శిక్ష పడదా.. ?

దిశ హత్య కేసు నిందితులని తక్షణమే ఉరితీయాలని యావత్ దేశం కోరుకుంటోంది. ఇందుకోసం చట్టాలని కఠినంగా రూపొందించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. సోమవారం పార్లమెంట్ లో దిశ ఘటనపై విస్తృత చర్చ జరిగింది. దిశ ఘటనని ముక్తకంఠంతో ఖండించారు. చట్టాల్లో మార్పులు చేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు.

మరోవైపు, అందరు కోరుకుంటున్నట్టు దిశ నిందితులకి ఇప్పట్లో శిక్షపడేలా కనిపించడం లేదు. ఎందుకంటే ? వంద మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనేది మన చట్టాలు చెబుతున్నాయి. ఏడేళ్లు గడుస్తున్నా.. నిర్భయ నిందితులకి ఇంకా ఉరిశిక్ష అమలు చేయలేదు. ముంబై దాడుల్లో రెడ్ హ్యాడెండ్ గా దొరికిన కసబ్ ని ఉరితీయడానికి యేడాదిన్నర కాలం పట్టింది. ఈ నేపథ్యంలో దిశ నిందితులకి ఇప్పట్లో శిక్ష పడటం సాధ్యం కానీ పని అని చెబుతున్నారు. అంతేకాదు..  చర్లపల్లి జైలుకి రోజునే దిశ నిందితులకి మటన్ తో భోజనం పెట్టారు. టీ, టిఫిన్స్, భోజనాలు పెట్టి మర్యాదలు చేశారు. మన చట్టాలు అలాంటివి మరీ.. !.