అబ్బో.. నభా ఫాలోయింగ్ చూశారా.. ?

ఇస్మార్ట్ పోరీగా అదరగొట్టిన నభా నటాషాకి ఓ రేంజ్ లో ఫాలోయింగ్ పెరిగింది. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నభా. ఈ యేడాది పూరి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత నభా క్రేజ్ అమాంతం పెరిగింది. స్టార్ హీరోలు, యంగ్ హీరోలు నభా కోసం చూస్తున్నారు. 

ఆ క్రేజ్ ని నభా బాగానే వాడుకుంటోంది. యాడ్స్ లో నటిస్తుంది. షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ కి వెళ్తుంది. తాజాగా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లిన నభాని చూడ్డాటానికి అభిమానులు పోటెత్తారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నభా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బెల్లకొండ శ్రీనివాస్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం నభా ఏకంగా కోటి రూపాయల పారితోషికం తీసుకుంటుందట.