అక్కడ దుమ్ములేపుతున్న సైరా
చరిత్రాత్మక సినిమాలో నటించాలన్నది మెగాస్టార్ చిరంజీవి చిరకాల కోరిక. ఆ కోరిని ‘సైరా’ నరసింహారెడ్డితో తీర్చుకొన్నాడు. కాదు తండ్రి కోరికని తనయుడు రామ్ చరణ్ తీర్చారు. తండ్రి జీవితంలో గుర్తిండిపోయే సినిమాని అందించాలనే తాపత్రయంతో సైరా కోసం భారీ బడ్జెట్ ని ఖర్చుపెట్టాడు చరణ్.
దాదాపు రూ. 250కోట్లు ఖర్చుపెట్టి ప్యాన్ ఇండియా సినిమా తీసుకొచ్చారు. దానికి ఫలితం దక్కింది. సైరాకి మంచి టాక్ వచ్చింది. మంచి సినిమా అనిపించుకొంది. కానీ, కమర్షియల్ గా హిట్ కాలేదు. ఇప్పుడు డిజిటిల్ ఫార్మెట్ లో మాత్రం సైరా హవా చూపిస్తుంది. దాదాపు రూ. 30కోట్లకి సైరా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ కొనేసిన సంగతి తెలిసిందే. సైరా రిలీజైన 50రోజుల తర్వాత ప్రైమ్ లో సైరా అందుబాటులోకి వచ్చింది.
ప్రైమ్ లో సైరాకు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుందని తెలుస్తోంది. ప్రైమ్ లో ఈ మూవీ తమిళ, మలయాళ, కన్నడ వర్షన్స్ ని కూడా ప్రేక్షకులు అధికంగా చూస్తున్నారని సమాచారమ్.తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్ది జీవితకథతో సైరా తెరకెక్కిన సంగతి తెలిసిందే. బిగ్ బీ అమితాబ్, నయనతార, తమన్నా, కిచ్చ సుధీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బాహుబలి తర్వాత టాలీవుడ్ నుంచి వచ్చిన ప్యాన్ ఇండియా సినిమా ఇది.