పూరి-విజయ్’లది.. ప్యాన్ ఇండియా సినిమా ! 


తెలుగు సినిమాలు బాలీవుడ్ లోనూ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కిన సాహో, సైరా సత్తా చాటాయి. టాక్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్స్ రాబట్టడం విశేషం. అంతేకాదు.. తెలుగు సినిమాలు బాలీవుడ్ లో రిమేక్ అయి.. మంచి విజయాలని నమోదు చేస్తున్నాయి. ఈ యేడాది మన అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ గా బాలీవుడ్ ప్రేక్షకులని మెప్పించాడు. మన జెర్సీ, ఎఫ్2, మజిలీ సినిమా బాలీవుడ్ లో రిమేక్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ దర్శక-నిర్మాతలకి ప్యాన్ ఇండియా సినిమాలు చేసేందుకు మరింత ధైర్యం పెరిగింది. పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించనున్న (ఫైటర్ -వర్కింగ్ టైటిల్) సినిమాని కూడా ప్యాన్ ఇండియా సినిమా తెరకెక్కించబోతున్నట్టు సమాచారమ్. దర్శకుడు పూరి బాలీవుడ్ లో సినిమాలు చేశాడు. దక్షిణాదిన అన్ని పరిశ్రమల్లోనూ ఆయన సుపరిచుతుడే. ఇక విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డికి బాలీవుడ్ జనాలు కూడా ఫిదా అయ్యారు. 

ఇక దక్షిణాదిన అన్నీ బాషల్లోనూ విజయ్ డియర్ కామ్రెడ్ రిలీజైంది. ఇదీగాక, ఫైటర్ కథ యూనివర్సల్ సబ్జెక్ట్ అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫైటర్ ని ప్యాన్ ఇండియా సినిమాగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారమ్. ఐతే, ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత అవసరమైతే.. కథలో చిన్ని చిన్ని మార్పులు చేయనున్నారని తెలుస్తోంది. నిజంగానే ఫైటర్ ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కితే.. అదే విజయ్ బాలీవుడ్ ఎంట్రీ సినిమా అవుతుంది. ఓ టాలీవుడ్ దర్శకుడితో విజయ్ బాలీవుడ్ కి పరిచయం కాబోతుండటం గొప్ప విషయమనే చెప్పాలి.