సోదరుడి పెళ్లిలో రష్మీ తీన్మార్ డ్యాన్సులు.. చూశారా ?
యాంకర్ రష్మి గౌతమ్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైన సంగతి తెలిసిందే. వైజాగ్ లో రష్మి సోదరుడు మలేయ్ త్రిపాఠి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లిలో రష్మిదే హవా. రచ్చ రచ్చ చేసింది. పెళ్లి వేడుకలో తీన్మార్ డ్యాన్సులతో అదరగొట్టింది. సాంప్రదాయంగా లంగా ఓణీ ధరించి స్టైలిష్ గా ఉన్న రష్మి బారాత్లో తీన్మార్ స్టెప్పులతో దుమ్ములేపింది.
సోదరుడి వివాహం కోసం వారంరోజుల ముందే రష్మి ఇంటికి వెళ్లింది. పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకొంది. ఈ వివాహానికి పలువురు రాజకీయ, వెండితెర, బుల్లి తెరకు చెందిన ప్రముఖులు హాజరు అయ్యారు. రష్మి సోదరుడి పెళ్లికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో రష్మి జబర్థస్త్ స్టెప్పులని చూసి ఎంజాయ్ చేస్తున్నారు.