తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. తిరుమల పర్యటనలో ఉన్న పవన్ జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్ తో కలిసి వెంకన్నని దర్శించుకొన్నారు. జనసేనానికి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం తన అదృష్టం. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామి వారిని కోరుకున్నానని తెలిపారు. మూడు దశాబ్దాల క్రితం ఇక్కడే తాను దర్మో రక్షతి రక్షిత: అని నేర్చుకున్నానని పవన్ తెలిపారు.
ఇక మరికొద్దిసేపట్లో పవన్ ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 6 నెలల వైసీపీ పాలనపై పవన్ మాట్లాడనున్నారు. మొదటి నుంచి వైసీపీ సర్కార్ పై పవన్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం, ఇంగ్లీష్ మీడియంపై పవన్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. సీఎం జగన్ ని జగన్ రెడ్డి అంటూ సంబోధిస్తున్నారు. తాజా మీడియా సమావేశంలోనూ సీఎం జగన్ పై పవన్ తీవ్ర విమర్శలు చేసే ఛాన్స్ ఉంది. ఇక ప్రెస్ మీట్ తర్వాత పవన్ మదనపల్లెకు వెళ్లనున్నారు. సాయంత్రం మదనపల్లెలో రైతులతో పవన్ సమావేశం కానున్నారు.