కంగనా ప్రయివేట్ పార్ట్స్’ని టచ్ చేసిన యువకుడు
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు చేధు అనుభవం ఎదురైంది. ఆమె వృక్షకోజాలని ఓ యువకుడు టచ్ చేశాడట. కంగనా మాటకి మొహమాటం ఉండదన్న సంగతి తెలిసిందే. ఏ విషయంపైనైనా, ఎవరిపైనైనా సూటిగా మాట్లాడేస్తుంటుంది. కొన్నిసార్లు అవి వివాదాస్పదం అవుతుంటాయి కూడా. అయినా.. కంగనా తన తీరు మార్చుకోదు. తనకి ఎదురైన సంఘటనల గురించి కంగనా ఏమాత్రం సిగ్గుపడకుండా బయటికి చెబుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాలేజ్ టైంలో ఎదుర్కొన్న ఓ చేధు అనుభవం గురించి తెలిపింది కంగనా.
కంగనా చండీఘర్ లో చదువుకునే సమయంలో స్కూల్ కి వెళ్తున్నప్పుడు అబ్బాయిలు బైక్ లపై వచ్చి ఆడపిల్లలను ఏడిపించేవారట. ఎక్కడపడితే అక్కడ టచ్ చేసేవారట. ఓ సారి ఓ యువకుడు బైక్ పై కంగనా దగ్గరకి వేగంగా దూసుకొచ్చి.. ఆమె వక్షోజాలపై కొట్టాడట. దాంతో ఆమె అక్కడే కళ్ళు తిరిగి పడిపోయిందట. దాదాపు ఐదు నిమిషాల వరకు స్పృహలోకి రాలేదట. స్పృహ వచ్చిన తరువాత ఎవరు చూడలేదు కదా అనుకుంటూ ఇంటికి వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చింది.
చిన్నప్పుడు తనకు అలాంటి ఘటన ఎదురైతే ఎవరైనా చూసుంటారేమో అని భయపడ్డానని.. కానీ ఇప్పుడు అలాంటి ఆలోచన వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొనే స్టేజ్ కి వచ్చినట్లు చెప్పుకొచ్చింది. అది నిజమే. ఎందుకంటే ? కంగనాతో పెట్టుకొనే ధైర్యం ఇప్పట్లో ఎవరు చేయరు. ఎందుకంటే ? ఆమె ఫైర్ బ్రాండ్. తాట తీయడం ఖాయం. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తలైవి సినిమాతో బిజీగా ఉన్నారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితకథతో తెరకెక్కుతోన్న చిత్రమిది.