కోకకోలా పెప్సీ.. ఈ మామ-అల్లుడు సెక్సీ !

విక్టరీ వెంకటేష్ ఆయన మేనల్లుడు నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. బాబీ దర్శకుడు. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్రబృందం. తాజాగా వెంకీమామ నుంచి ‘కోకకోలా పెప్సీ.. ‘ సాంగ్ ని విడుదల చేశారు. క్యాచీ పదాలతో.. యూత్ ఉర్రూతలూగించేలా ఉంది సాంగ్.

ఈ పాటకి కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. అతిధి బావరాజు, రమ్య బెహర, సింహా, హనుమాన్ కలిసి పాడారు. థమన్ సంగీతం అందించారు. వెంకీ-పాయల్, చైతూ-రాశీ కలిసి చిందేసిన.. కోకకోలా పెప్సీ సాంగ్ కలర్ ఫుల్లుగా ఉంది. ఈ సినిమాలో నాగచైతన్య సైనికుడి పాత్రలోను, వెంకటేశ్‌ రైతుగాను కనిపిస్తాడు. వెంకీ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌ నటిస్తోంది. నాగచైతన్య పక్కన రాశీ ఖన్నా కనిపించనుంది. సురేశ్‌ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాయి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాతలు.