యాదాద్రి నరసింహస్వామి రూపం చెక్కు చెదరలేదు

యాదాద్రి నరసింహస్వామి రూపంలో మార్పులు వచ్చాయి. స్వామి వారి నుదుటిపై సింధూరాన్ని తొలగించారు. నిర్మాణ పనుల్లో జరుగుతున్న అశుభ్రతపై పత్రికలో ఓ కథనం ప్రచురితం అయిన సంగతి తెలిసిందే. దీనిపై యాదాద్రి అర్చకులు స్పందించారు.

ప్రధానార్చకుడు లక్ష్మీనరసింహాచార్యులు మీడియాతో మాట్లాడుతూ.. “యాదాద్రి నరసింహస్వామి రూపంలో ఎలాంటి మార్పులు చేయలేదు. మూల విరాట్ రూపం చెక్కు చెదరలేదని స్పష్టం చేశారు. నరసింహస్వామి రూపమే ఉగ్రరూపమని.. అమ్మవారితో ఉండే శ్రీలక్ష్మీనారసింహుడు ప్రశాంతమూర్తి. తామే స్వయంగా స్వామి వారి నుదుటిపై సింధూరాన్ని తొలగించాం. పునర్నిర్మాణ పనుల్లో ఇతరులు ఎవర్నీ లోపలికి అనుమతించడం లేదని.. నిర్మాణ కార్మికులందరూ పరిశుభ్రంగా ఉంటేనే పనుల్లోకి పంపించాం” అని తెలిపారు.