సెన్సార్ వాళ్లు డబ్బులు అడుగుతున్నారు : షకీలా
నటి షకీలా సెన్సార్ బోర్డుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె నటించిన చిత్రం ‘లేడీస్ నాట్ అలవ్డ్’. ఇదొక అడల్ట్ కామెడీ సినిమా. పోస్ట్ పొడ్రక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఇప్పటికే రెండుసార్లు సెన్సార్ బోర్డ్ సభ్యులు తిరస్కరించారు. ఈ చిత్రానికి సెన్సార్ పూర్తి చేయడానికి కొందరు వ్యక్తులు డబ్బులు అడుగుతున్నారని షకీలా ఆరోపించారు. దానికి సంబంధించి కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయని షకీలా వార్నింగ్ ఇచ్చారు.
తన చిత్రాన్ని తిరస్కరించడానికి గల కారణమేమిటని సెన్సార్ బోర్డు సభ్యులను ప్రశ్నించారు. ఈ జోనర్ లో వచ్చిన ఎన్నో చిత్రాలకు సెన్సార్ ఇచ్చారు. కానీ మా చిత్రానికి మాత్రమే సెన్సార్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, షకీలా సినిమాల కోసం వేచి చూసి ప్రత్యేక ప్రేక్షక వర్గం ఉందన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు షకీలా సినిమా రిలీజ్ అవుతుందంటే.. స్టార్ హీరోల సినిమాలు వాయిదాపడేవి. ఇప్పుడు అంత క్రేజ్ లేకున్నా.. ఆమెకి ప్రత్యేక ప్రేక్షకగణం ఉంది. ఆ ధైర్యంతోనే షకీలా నిర్మతగా మారి ‘లేడీస్ నాట్ అలవ్డ్’ సినిమాని తెరకెక్కించారు.