సప్రైజ్ : జేసీ రిటైర్మెంట్‌ ప్రకటన

టీడీపీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాటలు, చేతలు సప్రైజ్’గా ఉంటాయి. తాజాగా, ఆయన సడెన్ సప్రైజ్ ఇచ్చారు. పొలిటికల్ రిటైర్మెంట్‌’పై ప్రకటన చేశారు. ఇప్పటికే వచ్చే సాధారణ ఎన్నికలు (2019)లో పోటీ చేయబోనని జేసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ యేడాది నుంచే రాజకీయాలకు దూరం కానున్నట్టు తెలిపారు. దీంతో.. జేసీ పొలిటికల్ జేసీ రిటైర్మెంట్‌ ప్రకటించారని చెప్పుకొంటున్నారు.

పొలిటిక్స్ లో జేసీ దివాకర్ రెడ్డి ది డిఫరెంట్ స్టయిల్. సొంత, ప్రతి పక్ష పార్టీలు అనే తేడా ఆయనకు తెలీదు. టైమొస్తే.. సొంత పార్టీనే విమర్శించేంత దమ్మున్న నేత. అందుకే జేసీ మీడియా ముందుకు వస్తే సొంత పార్టీ నేతలే భయపడిపోతుంటారు. ఇక, జేసీ రిటైర్మెంట్‌ తర్వాత హాయిగా వ్యవహాసాయం చేసుకొంటాడ. మరోవైపు, జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి 2019 ఎన్నికల్లో బరిలోకి దిగనున్నాడు. ఆయన అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారమ్.