బీజేపీ ఓపెన్ ఆఫర్.. పవన్ ఓకే చేస్తాడా ?
జనసేన పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది అంటూ కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారం నిజం అన్నట్టుగానే తిరుపతి పర్యటనలో జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేయడం విశేషం. తాను ఎప్పుడు బీజేపీకి దూరం కాలేదని.. తనకి అమిత్ షా అంటే ఇష్టమని పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఏపీలో మత మార్పిడిపై జగన్ సర్కార్ ని పవన్ గట్టిగా ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో బీజేపీ పవన్ కి ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. జనసేనని బీజేపీలో విలీనం చేస్తానంటే.. తాను మాట్లాడతానని ఆ పార్టీ నేత జీవీఎల్ అన్నారు. అంతేకాదు.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకి ముందే జనసేనని బీజేపీలో విలీనం చేయమని కోరాం. అందుకు అప్పుడు పవన్ ఒప్పుకోలేదు. ప్రస్తుతం ఆయన మాటలని బట్టీ చూస్టే బీజేపీకి చేరేలా కనిపిస్తున్నారనే తెలిపారు.
అంతేకాదు.. ఏపీలో కొత్త తరం నాయకుల కోసం భాజాపా చూస్తుంది. పవన్ వస్తే స్తాగతిస్తాం. ఆయనకే ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగిస్తాం అన్న రీతిలో జీవీఎల్ వ్యాఖ్యలు చేశారు. నిజంగా జనసేనని బీజేపీలో విలీనం చేసి.. ఏపీ భాజాపా పగ్గాలు పవన్ కి అప్పగిస్తే… అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమేమీ కాదేమో. మరీ.. బీజేపీ ఓపెన్ ఆఫర్ కి పవన్ ఒప్పుకొంటాడా ? అన్నది చూడాలి.
మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి.. దాన్ని చివరకు కాంగ్రెస్ లో కలిపేశారు. తనపై ప్రజలు పెట్టుకొన్న నమ్మకాన్ని వమ్ముచేశారు చిరు. ఇప్పుడు పవన్ కూడా జనసేనని భాజాపాలో కలిపేసి.. అన్న చిరంజీవి దారిలో వెళ్తారా.. ? లేక భాజాపా ఓపెన్ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించి.. ఫ్రెండ్లీ పార్టీలుగా ముందుకెళదామని ప్రపొజల్ పెడతారా ?? అన్నది చూడాలి.