బిగ్ బ్రేకింగ్ : దిశ నిందితుల ఎన్ కౌంటర్

దిశ నిందితులని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్న కేశవులను శుక్రవారం తెల్లవారుజామున ఎన్ కౌంటర్ చేశారు. అయితే పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. దీనిపై మరికొద్దిసేపట్లో సీపీ సిజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 

దిశ హత్యాచారం జరిగిన చోట సీన్ రీకన్ స్ట్రక్షన్ చేస్తుండగా పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారని, ఈ క్రమంలో పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని పోలీసు ఉన్నతాధికారులు ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. దిశని అత్యాచారం చేసిన చోటనే అదే సమయంలో (రాత్రి 2.30-3.30 మధ్య సమయంలో) నిందితులని ఎన్ కౌంటర్ చేసినట్టు తెలుస్తోంది. 

ఐతే, నిందితులు పోలీసులపై ఎటాక్ చేసిన నేపథ్యంలో ఎన్ కౌంటర్  చేశారా ? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి యావత్ దేశం దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని, లేదా బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్లు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందరి కోరిక తీరినట్టయింది. కాగా, గత నెల 27న దిశను నిందితులు అత్యాచారం చేసి ఆ తర్వాత కాల్చి చంపిన సంగతి తెలిసిందే.