హ్యాట్సాఫ్.. సజ్జనార్ సర్ !

ఏడేళ్లు గడుస్తున్నా.. నిర్భయ నిందితులకి ఉరిశిక్ష పడలేదు. అసలు ఉరి వేయడానికి తలారి కూడా లేదు. ఉరివేసే ప్రదేశంపై సరైన క్లారిటీ కూడా లేదు. ఈ నేపథ్యంలో దిశ నిందితులని కూడా యేళ్లకి యేళ్లు జైలు పెట్టి మేపుతారని అందరూ భావించారు. అలా జరగకూడదు. దిశ నిందితులని తక్షణమే ఉరితీయాలని యావత్ దేశం గర్జించింది. చివరికి ఆ గర్జనకి ఫలితం దక్కినట్టయింది.

శుక్రవారం తెల్లవారుజామున దిశ నిందితులు ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులని పోలీసులు  ఎన్‌కౌంటర్ చేశారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు పోలీసులని ప్రతి ఘటించి పారిపోయేందుకు యత్నించారు. దీంతో నిందితులని ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. నిజ నిజాలు ఏమైనా గానీ… ఈ చర్యపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 10రోజుల్లోనే దిశ నిందితులకి ఉరిపడటం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఎన్‌కౌంటర్  క్రెడిట్ అంతా  ఐపీఎస్ అధికారి సజ్జనార్‌దే. సరిగ్గా 10 సంవత్సరాలు క్రితం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో .. వరంగల్ కిట్స్ ఇంజినీరింగ్ కలేజ్ విద్యార్థులు స్వప్నిక, ప్రణితలపై యాసిడ్ దాడి జరిగింది. ఆ సమయంలో వరంగల్ ఎస్పీగా ఉన్న సజ్జనార్ 24 గంటల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల్లోనే ”ముగ్గురు నిందితులు శాఖమూరి శ్రీనివాస్, బజ్జరి సంజయ్, పోతరాజు హరికృష్ణలను ఎన్‌కౌంటర్ చేశారు.

దిశ నిందితుల ఎన్‌ కౌంటర్ నేపథ్యంలో వరంగల్ ఘటనని అందరు గుర్తు చేసుకుంటున్నారు. సజ్జనార్ కి సెల్యూట్ చేస్తున్నారు. ఆయన గన్ పట్టుకొన్న పిక్ ని సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్ గా పెట్టుకొంటున్నారు. ఇక ఈ ఘటనతో సీఎం కేసీఆర్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని గుర్తు తెస్తున్నారని పలువురు చెప్పుకొంటున్నారు. మొత్తానికి.. యావర్ దేశం హర్షం వ్యక్తం చేసే పనిని తెలంగాణ పోలీసులు చేశారు. సలామ్ తెలంగాణ పోలీస్.