తెలంగాణ పోలీసులకి చేతులెత్తి మొక్కిన పూరి
దిశ నిందితులని ఎన్‌కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా తెలంగాణ పోలీసుల చర్యని సమర్థిస్తున్నారు. సెల్యూట్ తెలంగాణ పోలీస్ అంటున్నారు. తాజాగా దర్శకుడు పూరి జగన్నాథ్ దిశ నిందితుల ఎన్‌కౌంటర్’పై స్పందించారు.
‘సెల్యూట్.. తెలంగాణ పోలీస్ డిపార్టుమెంటుకి చేతులెత్తి మొక్కుతున్నాను. మీరే మా రియల్ హీరోస్ . నేనెప్పుడు ఒక విషయాన్ని నమ్ముతాను. మనకి కస్టమొచ్చిన కన్నీళ్లొచ్చినా పోలీసోడే వస్తాడు . నువ్వే దిక్కు రక్షించాలని దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే” అంటూ పూరీ ట్విట్ చేశాడు. పూరి దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ సినిమా ఓ యువతి రేప్ కేసు నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ కేసుని క్లైమాక్స్ లో కథానాయకుడు ఎన్టీఆర్ తనపై వేసుకొని.. నేరం ఒప్పుకొన్నా.. ఇప్పటికిప్పుడు నన్ను ఉరితీసే దమ్ము ప్రభుత్వానికి, పోలీసులకి ఉందా ? అని ప్రశ్నించాడు. ఇప్పుడు తెలంగాణ పోలీసులు అదే చేశారు.
మాస్ మహారాజా రవితేజ కూడా ట్విట్టర్ వేదికగా దిశ నిందితుల నిందితులని ఎన్‌కౌంటర్ పై స్పందించారు. ‘దిషాకు న్యాయం చేయడం ఇక్కడ ఆగొద్దు . బాల్యం నుండి విద్య, సాధికారత మరియు జ్ఞానోదయం ద్వారా ఇటువంటి ఘోరమైన నేరాలను నిరోదించాలి. జైహింద్. ఇప్పుడు దిశ ఆత్మ శాంతిస్తుంది’ అని రవితేజ రాసుకొచ్చారు.
SALUTE 🙏🏽Telangana పోలీస్ డిపార్టుమెంటుకి చేతులెత్తి మొక్కుతున్నాను you are the real heros .I always believe one thing మనకి కస్టమొచ్చిన కన్నీళ్లొచ్చినా పోలీసోడే వస్తాడు . నువ్వే దిక్కు రక్షించాలని దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే @TelanganaDGP @KTRTRS 🙏🏽
— PURIJAGAN (@purijagan) December 6, 2019
Aaaaaaaaat salute 🙏🏽💪🏽 https://t.co/sZhFiYFbbO
— PURIJAGAN (@purijagan) December 6, 2019