రివ్యూ : 90ఎంఎల్ – కిక్కునివ్వలేదు
చిత్రం : 90ఎంఎల్ (2019)
నటీనటలు : కార్తికేయ, నేహా సోలంకి, ప్రగతి, రావు రమేష్, రవి కిషన్ తదితరులు
సంగీతం : అనూప్ రూబెన్స్
దర్శకత్వం : శేఖర్ రెడ్డి
రిలీజ్ డేటు : 06డిసెంబర్, 2019
శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తీకేయ-నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ’90ఎంఎల్’. ‘ఫేటెల్ ఆల్కహాల్ సిండ్రోమ్’ అనే అరుదైన కండీషన్ ని పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రమిది. ‘ఆర్ఎక్స్100’తో తనేంటో ప్రూవ్ చేసుకున్న కార్తికేయ ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు హిప్పీ, గుణ369 నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో ’90ఎంఎల్’పై కార్తీకేయ భారీ ఆశలు పెట్టుకొన్నాడు. మరీ.. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన 90ఎంఎల్ ఎలా ఉంది? ఏ మేరకు ప్రేక్షకులని ఆకట్టుకొంది తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ : దేవదాసు (కార్తికేయ) పుట్టుకతోనే ‘ఫేటెల్ ఆల్కహాల్ సిండ్రోమ్’ సమస్యతో పుడతాడు. దాంతో అతనికి ప్రతిరోజుకి మూడు సార్లు 90ఎంఎల్ డోస్ ఇవ్వమని చెబుతారు. అతని రోగాని అదే విరుగుడు. ఇక కార్తీకేయ చదువుల్లో టాప్, ఎంబీఏ లో గోల్డ్ మెడలిస్ట్. కానీ ఈ 90ఎంఎల్ సమస్య గురించి తెలిసి ఏ కంపెనీ ఉద్యోగం ఇవ్వదు. సువాసన (నేహా సోలం)కితో దేవదాసు ప్రేమలో పడతాడు. కానీ, ఆమె కుటుంబ సభ్యులకు ఈ తాగుడు గోల, వాసన పడదు. ఉద్యోగం, ప్రేమ కోసం దేవదాసు పడిన 90ఎంఎల్ ఇక్కల్లేంటీ ? ప్రేమకోసం దేవదాస్ 90ఎంఎల్ వేయడం మానేశాడా ? మందుమానేసిన దేవదాసుకి ఏం అయింది ? అనేది తెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
* కథ
* కార్తీకేయ నటన
* కొన్ని మాస్ మూమెంట్స్, కొన్ని కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్ :
* కథనం
* స్లో నేరేషన్
* రొటీన్ యాక్షన్
నటీనటుల ఫర్ ఫామెన్స్ : దర్శకుడు శేఖర్ రెడ్డి డిఫరెంట్ కథని ఎంచుకొన్నాడు. ‘ఫేటెల్ ఆల్కహాల్ సిండ్రోమ్’ సమస్యతో కథని అల్లుకొన్నాడు. దాని గురించి చెబుతూ సినిమాని ఆసక్తికరంగా మొదలెట్టాడు. ఐతే, కథ ముందుకు వెళ్తుంటే.. రొటీన్ గా మారింది. డిఫరెంట్ లైన్ ని ఎంచుకొన్న దర్శకుడు.. రొటీన్ కథనంతో బోర్ కొట్టించాడు. ఇక కార్తీకేయ నటనకి మాత్రం వంకపెట్టలేం. నటన, డ్యాన్స్, యాక్షన్ లోనూ ఇరగదీశాడు. హీరోయిన్ నేహా సోలంకి అద్భుతంగా కాకపోయినా.. ఫర్వాలేదనిపించింది. రావు రమేష్, ఇతర నటీనటులు తమ తమ పరిధి మేరకు నటించారు.. మెప్పించారు.
సాంకేతికంగా : కథ బాగుంది. కథనం బాగుంటే ’90ఎంఎల్’ ప్రేక్షకులకి కిక్కునిచ్చేదే. ‘ఫేటెల్ ఆల్కహాల్ సిండ్రోమ్’ పాయింట్ తో వినోదం, భాగోద్వేగాలని పండిచొచ్చు. కానీ దర్శకుడు రొటీన్ స్క్రీన్ ప్లే తో యాక్షన్స్ సినిమాలా మార్చేశాడు. అనూప్ రూబెన్స్ అందించన పాటలు, నేపథ్య సంగీతం ఓ మోస్తరుగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సెకాంఢాప్ లో చాలా బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయి. వాటికి కత్తెర పెట్టొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా : 90ఎంఎల్.. కిక్కునివ్వలేదు !
రేటింగ్ : 2.5/5