‘డిస్కోరాజా’ టీజర్ టాక్ 

వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం ‘డిస్కోరాజా’. రవితేజ సరసన హీరోయిన్లుగా ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్ నటిస్తున్నారు. సునీల్, తాన్యా హోప్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య తదితరులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఎస్‌ఆర్‌టీ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్‌ తళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20న రావాల్సిన డిస్కోరాజా వచ్చే యేడాది జనవరి 24కి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

తాజాగా డిస్కోరాజా టీజర్ ని విడుదల చేశారు. టీజర్ లో హాలీవుడ్ నిపుణల పర్యవేక్షణలో ఐస్లాండ్ తదితర ప్రాంతాల్లో తీసిన విజువల్స్ తో పాటుగా, అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ల్యాబ్ సెట్ లో తీసిన షాట్స్ వదిలారు. రవితేజ రిట్రో గెట్ అప్ పై ఉన్న యాక్షన్ షాట్ ఒకటి అదిరిపోయింది. డిస్కోరాజాలో ఫుల్లు కిక్కు ఇవ్వబోటున్నట్టు టీజర్ తో అర్థమవుతోంది.