కెఎల్ రాహుల్ (62) అవుట్, టీమిండియా 153/2 (14.2ఓవర్లు)
హైదరాబాద్ ఉప్పల్ వేదికగా భారత్-విండీస్ ల మధ్య జరుగుతున్న తొలి టీ20లో పరుగుల వరద పారుతుంది. తొలి బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. విన్ లెవిస్(40; 17 బంతుల్లో, 3×4, 4×6), బ్రాండన్ కింగ్(31; 23 బంతుల్లో 3×4, 1×6), హెట్మేయర్(56; 41 బంతుల్లో 2×4, 4×6), కెప్టెన్ పొలార్డ్ (37; 19 బంతుల్లో 1×4, 4×6) రాణించారు. ఆఖర్లో.. జేసన్ హోల్డర్ (24; 9 బంతుల్లో 1×4, 2×6), దినేశ్ రామ్దిన్(11; 7 బంతుల్లో 1×4) చెలరేగి ఆడారు.
208 భారీ లక్ష్యంతో దిగిన టీమిండియా దాటిగానే ఆరంభించింది. 4 ఓవర్ లో 33 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయినా.. పరుగుల వేగం తగ్గలేదు. కె ఎల్ రాహుల్ (62, 40బంతుల్లో), కెప్టెన్ కోహ్లీ (44, 34 బంతుల్లో.. బ్యాటింగ్) స్లోర్ బోర్డుని పరుగెత్తించారు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ44, పంత్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. పంత్ ఆడిన తొలి బంతికే సిక్సర్ బాదడం విశేషం. 14.3ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 153 పరుగులతో టీమిండియా ఆటని కొనసాగిస్తోంది.