ట్రైలర్ టాక్ : వెంకీమామ

కెయస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, ఆయన మేనల్లుడు నాగ చైతన్య కలిసి నటించిన చిత్రం ‘వెంకీమామ’. పాయల్ రాజ్ పుత్, రాశీఖన్నా కథానాయికలు. థమన్ సంగీతం అందించారు. సురేశ్‌ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. వచ్చే వారమే (డిసెంబర్ 13) వెంకీమామ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

తాజాగా వెంకీమామ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఖమ్మంలో ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. వినోదం, భాగోద్వేగం, యాక్షన్, రొమాన్స్.. అన్నీ కవర్ చేస్తూ ట్రైలర్ ని కట్ చేశారు. అల్లుడు కోసం తపనపడే మామగా వెంకీ, మామకి పెళ్లి చేయాలనే తపనపడే అల్లుడుగా చైతూ ట్రైలర్ లో కనిపించారు. అంతకుమించి ఏదో దైవ సంకల్పం ఉన్నట్టు ట్రైలర్ ని చూస్తే అనిపిస్తుంది. ఈ కథని జనార్థన మహర్షి అందించారు. కాబట్టి.. అలాంటి పాయింట్ ని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.

ఇక ట్రైలర్ వెంకీ చెప్పిన డైలాగ్స్ బాగా పేలాయి. వెంకీ-పాయల్, వెంకీ-చైతూల మధ్య వచ్చే సీన్స్ వినోదాన్ని పండించేలా ఉన్నాయి. మొత్తానికి వెంకీమామ నవరసాలున్న సినిమాగా అనిపిస్తోంది. వచ్చే వారం నుంచే వెంకీమామ సందడి మొదలుకానుంది.